ఆకేరు, న్యూస్ స్టేషన్ ఘన్పూర్ :
రిజర్వేషన్లు కల్పించిన రాజ్యాంగాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అవమాన పరుస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆరోపించారు. శుక్రవారం జనగామ జిల్లా చిల్పూర్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ అంగ రంగ వైభవంగా జరగవలసిన పొట్లపల్లి శ్రీధర్ రావు దేవస్థాన చైర్మన్ ప్రమాణ స్వీకారం కడియం శ్రీహరి పుణ్యమా అని విఫలం అయ్యింది అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చీట్ ఇచ్చాడంటే జబ్బలు ఎగరేసుకోవడం కాదు నీవు బిఆర్ఎస్ పార్టీ వ్యక్తివని, నీ బాస్ కెసిఆర్ అని తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో సిఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయించిన వారిని రాళ్లతో కొట్టి చంపమని కూడా ఆదేశించడం జరిగిందని అది నీకు వర్తిస్తుంది అన్నారు. బిఆర్ఎస్ పార్టీ నిన్ను గెలిపించిన కార్యకర్తలు రాళ్లు, చీపురు కట్టలతో కొట్టే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చేసినట్లు తెలిపారు. బిఆర్ఎస్ కేటాయించిన పది కోట్ల పనులు ఇప్పటివరకు నత్తనడకన జరుగుతున్నాయని పేర్కొన్నారు. దేవాదుల సృష్టికర్త అని చెప్పుకునే కడియం శ్రీహరి ఒక్క రూపాయి దేవాదులకు కేటాయించలేదు అభివృద్ధి నిరోధకుడు కడియం శ్రీహరి అని దుయ్యబట్టారు. సమావేశంలో కేశిరెడ్డి రాకేష్ రెడ్డి, బత్తుల రాజబాబు, మారపాక రమేష్, గణగోని రాజు, రంగు హరీష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
