* సంక్రాంతి వేళ సందడే సందడి
ఆకేరున్యూస్ ,డెస్క్ : వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేయడాని రాజాసాబ్ వచ్చేస్తున్నాడు… అదే నండోయ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా 2026 జనవరి 9న రిలీజ్ కాబోతున్నట్లు తెలిసింది. టాలీవుడ్ దర్శకుడు మారుతి దర్వకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ సినిమా అంటేనే ఓ సెన్సేషన్ అనేలా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ సినిమాలు భారీ కలెక్షన్లను చేస్తున్నాయనే విషయం తెల్సిందే.. బాహుబలి సినిమా నుండి ఈ ట్రెండ్ మొదలైంది. బాహుబలి సినిమా ప్రభాస్ కెరీర్ లో పెద్ద మలుపు. ఆ తరువాత వచ్చిన అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన సినిమాలే. ప్రభాస్ నటించిన కల్కి2898 ఎంత సంచలనం రేపిందో తెల్సిందే..సలార్, ఆదిపురుష్,రాధేశ్యామ్,సాహూ సినిమాలు అన్నీ ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బాగా ఆడాయి. తాజాగా వస్తున్న రాజా సాబ్ సినిమా పై ప్రభాస్ అభిమానులు భారీ ఎక్స్ప్టేషన్స్ తో ఉన్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి గ్రాండ్గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్లో అమెరికాలో భారీస్థాయిలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. చక్రం సినిమాలో జగమంత కుటుంబం నాదీ అంటూ పాటపాడుకున్న ప్రభాస్ కు నిజంగానే ఇప్పుడు జగం అంతా ప్రభాస్ సినిమాల కోసం ఎదురుచూస్తోంది.
………………………………………………..
