* రోడ్డు ప్రమాదంలో 9 మంది దుర్మరణం
* మరొకరి పరిస్థితి విషమం
ఆకేరు న్యూస్, రాజస్థాన్ :
రాజస్థాన్ లో తీవ్రమైన విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో 9 మంది దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. రాజస్థాన్ ఝలావార్ జిల్లా లో ఈ విషాదం చోటుచేసుకుంది. వ్యాన్ను ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని ఝలావార్ జిల్లా ఎస్పీ రిచాతోమర్ తెలిపారు. బాధితులు మధ్యప్రదేశ్లోని వివాహ కార్యక్రమానికి హాజరై వస్తుండగా, ఆక్లేరా జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
——————