* చీకట్లోనే రెస్క్యూ ఆపరేషన్
* తెల్లవారుజామున రక్షించిన సిబ్బంది
* కార్మికుల సేఫ్‌తో ఊపిరి పీల్చుకున్న అధికారులు
* కొనసాగుతున్న సహాయక చర్యలు
ఆకేరు డెస్క్ : రాజస్థాన్ లోని ఓ గనిలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో 15 మంది కార్మికులు చిక్కుకున్నారు. హుటాహుటిన స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్స్ ను వేగవంతం చేసింది. బుధవారం తెల్లవారుజాము వరకు కొంత మందిని రక్షించింది. రాజస్థాన్ ( Rajasthan )లోని హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీ లోని కోలిహన్ గనిలో ఉన్న లిఫ్ట్ రోప్ తెగిపోవడం వల్ల కార్మికులు చిక్కుకుపోయారు.ఉద్యోగులను తీసుకెళ్తుండగా ఈ వర్టికల్ లిఫ్ట్ కూలింది. దీంతో మంగళవారం రాత్రి 15 మంది కార్మికులు గనిలో కూరుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హుఠాహుటిన రంగంలోకి దిగిన రెస్క్యూ టీం.. చీకట్లోనే సహాయక చర్యలను కొనసాగించింది. బుధవారం తెల్లవారుజామున కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చింది. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు డాక్టర్ మహేంద్ర సింగ్ తెలిపారు. కార్మికులు సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
———————————-