* విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ హోదాలో ఉన్న రతన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ ( 59 ) ఆకస్మికంగా మృతి చెందారు. మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్ళిన రాజీవ్ రతన్ (Rajiv Rathan IPS ) కు చాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆస్ప్రిత్రి వైద్యులు పరీక్షించి తీవ్రమైన గుండెపోటు ( Heart attack ) రావడంతో మృతి చెందాడని ధృవీకరించారు. మరో ఐదునెలల్లో ఆయన పదవీ విరమణ పొందనున్నారు. కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ తీవ్ర దిగ్భ్రాంతిని , సంతాపాన్ని వ్యక్తం చేశారు. 1991 బ్యాచ్ ఐపీయస్ అధికారి అయిన రాజీవ్ రతన్ పలు హోదాల్లో పనిచేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్, మేనేజింగ్ డైరెక్టర్ పోలీస్ హౌజింగ్ , హైదరాబాద్ రీజియన్ ఐజీ , కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేశారు. గత ఏడాది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందారు. మేడిగడ్డ పియర్స్ కుంగుబాటుకు సంబందించి పూర్తి స్థాయి విచారణ జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం మేడిగడ్డ పర్యటనలో తన విచారణకు సంబందించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
————————————–