
* 5 నుంచి 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటన
* అధికారులతో వీడియో భట్టి వీడియో కాన్ఫరెన్స్
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు పొడిగించినట్లు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు.రాజీవ్ యువ వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తుందని, అధికారులు అప్రమత్తంగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. సోమవారం ప్రజా భవన్ నుంచి ఆయన చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సవిూక్ష సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగ యువత వారి కాళ్లపై వారు నిలబడాలన్న మహోన్నత ఆశయంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తుందని డిప్యూటీ సీఎం తెలియజేశారు. దశాబ్ద కాలంగా నిరుద్యోగ యువతపై ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నిధులు ఖర్చు చేయలేదని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను ఈ పథకం ప్రగతిపై నిరంతరం సవిూక్షిస్తామని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ మొదలు గ్రౌండిరగ్ వరకు నిరుద్యోగ యువత ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని మండలపరిషత్, పురపాలక కార్యాలయాల్లో రాజీవ్ యువ వికాసం దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని, అభ్యర్థులు అక్కడికక్కడే దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు- చేయాలని జిల్లాల కలెక్టర్లను భట్టి ఆదేశించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఐటి,పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎంపి-కై-న లబ్ధిదారులకు పరిశ్రమల శాఖ అవగాహన కల్పిస్తుందని తెలిపారు. ఈ పథకం విజయవంతం కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ ప్రతి మండల కార్యాలయంలోనూ, పురపాలక కార్యాలయంలోనూ దరఖాస్తులను అందుబాటులో ఉంచాలని అన్నారు. ఈ దరఖాస్తుల పరిశీలనకు మండలస్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు- చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి బ్యాంకర్లతో త్వరలో సమావేశం నిర్వహించి పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి కృషి చేయాలని అన్నారు.
………………………………………