* యుద్ధనౌకపై సముద్ర ప్రయాణం
* మంత్రిగా రెండో సారి ప్రమాణం తర్వాత తొలి పర్యటన
ఆకేరు న్యూస్, విశాఖ : కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన రాజ్‌నాథ్‌సింగ్ తొలిసారిగా విశాఖలో పర్యటిస్తున్నారు. అక్కడి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఆయనకు కలెక్టర్, సీపీ, నేవీ అధికారులు స్వాగతం పలికారు. డే ఎట్ సీ కార్యక్రమంలో భాగంగా ఆయన సాయంత్రం వరకు యుద్ద నౌకమీద సముద్రంలో ప్రయాణించనున్నారు. యుద్ద నౌకల సన్నద్దతను పరిశీలించి నౌకాదళ సిబ్బందికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించే తీరుపై సమీక్షిస్తారు. ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు ఢిల్లీలో బయలుదేరిన ఆయన మధ్యాహ్నం 12.20 గంటలకు విశాఖలోని నేవల్ ఎయిర్ స్టేషన్ ‘ఐఎన్ఎస్ డేగాకు చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి హెలి కాప్టర్లో బయలుదేరి 12.50 గంటలకు విశాఖ తీరంలో ఉన్న ఐఎన్ఎస్ జలాశ్వ నౌకపై దిగారు. ఈ పర్యటనలో తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
————————–