* మహమబూబాబాద్లో విషాదం
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : సోదరులకు రాఖీ (Rakhi)కట్టి ఓ యువతి కన్నుమూసింది. ఈవిషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District)నర్సింహుల పేట కు చెందిన యువతి (17) కోదాడలో డిప్లొమా చేస్తోంది. ప్రేమ పేరుతో ఓ యువకుడు ఆమె వెంట పడేవాడు. దీంతో తీవ్రమనస్తాపం చెందిన యువతి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను మహబూబాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్న యువతి రాఖీ పండుగ (Rakhi Festival)వరకు తాను బతికి ఉంటానో లేదో అని శనివారం రాత్రే తన అన్న, తమ్ముడికి రాఖీ కట్టింది. రాఖీ కట్టిన కొద్ది గంటల్లోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చూసి అందరు కంటతడి పెడుతున్నారు.
———————————————–—