
Minister Komati Reddy gives currency notes to Seethakka who tied Rakhi
* రాఖీ కట్టిన సీతక్కకు నోట్ల కట్ట ఇచ్చిన మంత్రి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అన్నాచెల్లెళ్లు-అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులూ ఈ పండుగను చేసుకున్నారు. తెలంగాణ మంత్రి సీతక్క (Seethakka) హైదరాబాద్లోని పలువురు ప్రముఖులఖు రాఖీ కట్టారు. ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రాఖీ కట్టి నోరు తీపి చేశారు. అనంతరం మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy)కి కూడా ఆమె రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఆమెకు కోమటిరెడ్డి ఓ నోట్ల కట్టను ఇచ్చారు. వద్దు అన్నయ్య.. అని సీతక్క వారిస్తున్నా.., మొహమాటం పడకంటూ చేతిలో పెట్టారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
————————————