
ఆకేరున్యూస్, వరంగల్: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల్లోని ఈద్గాలు, మసీదులను ప్రార్థనల కోసం సిద్ధం చేశారు. వివిధ ప్రాంతాల్లో గల ఈద్గాల వద్ద ప్రార్థనల కోసం చేసిన ఏర్పాట్లను పోలీసులు, ఇతర శాఖల అధికారులు పర్యవేక్షించారు. ప్రజలంతా సోదరభావంతో పండుగను నిర్వహించుకోవాలని నాయకులు, అధికారులు కోరారు. అలాగే ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో వరంగల్ ఈద్గాలు మసీదులో రంజాన్ సందడి నెలకొంది. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ ఈద్గా ప్రార్థనల్లో పాల్గొన్నారు. అలాగే హనుమకొండ బొక్కలగడ్డ ఈద్గా ప్రార్థనల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లా కేంద్రాల్లోనూ మసీదులు, ఈద్గాలు ముస్లింలతో కిక్కిరిసిపోయాయి.
………………………..