
* పసికందుకు బిలియరీ అట్రేసియా అనే ప్రాణాంతక వ్యాధి
* ఆపరేషన్ తో బతికించిన డాల్ఫిన్ చిల్ట్రన్స్ హాస్పిటల్ వైద్యులు
* వైద్య చరిత్రలో అరుదైన ఘటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హనుమకొండలోని డాల్ఫిన్ చిల్ట్రన్స్ హాస్పిటల్ వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి 72 రోజుల పసికందును బతికించారు. వరంగల్ జిల్లా వైద్య చరిత్రలోనే ఇది ప్రథమం అంటున్నారు. వివరాల్లోకి వెళితే సంగెం మండలం ముప్పిడివరం గ్రామానికి చెందిన రాజు స్వాతి దంపతులకు జన్మించిన చిన్నారి జబ్బుతో బాధపడుతోంది. చిన్నారి వైద్యం కోసం చాలా చోట్ల ప్రయత్నం చేసిన ఆ దంపతులు చివరికి హనుమకొండలోని డాల్ఫిన్ చిల్ట్రన్ హాస్పిటల్ లో చేర్పించారు. చిన్నారినికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు చిన్నారికి బిలియరీ అట్రేసియా అనే ప్రాణాంతక వ్యాధి ఉందని గుర్తించారు.ఈ వ్యాధి లివర్ కు సంబందించినది. అయితే వైద్య చరిత్రలో ఇప్పటి వరకు వరంగల్ డాక్టర్లు ఇలాంటి ఆపరేషన్ చేయలేదు. చిన్నారి తల్లిదండ్రలకు ధైర్యం చెప్పి రిస్క్ తీసుకొని క్లిష్టమైన ఆపరేషన్ చేసి చిన్నారిని ప్రాణాంతక వ్యాధి నుంచి కాపాడారు. దీంతో చిన్నారి తల్లిదండ్రలు ఆనందానికి అవధులు లేకుండా ఉంది. డాల్ఫిన్ చిల్ట్రన్స్ హాస్పిటల్ వైద్యుల ప్రతిభను కొనియాడుతున్నారు. మా బిడ్డకు పునర్జన్మ ఇచ్చారంటూ కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నారు.
……………………………………………….