Rashmika Mandanna Mysaa Release Date
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మైసా’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేశారు. తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం ఈ సినిమా 2026 నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
* అత్యంత పవర్ఫుల్ ..అవతార్
రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసా’ను అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. పీరియాట్రిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మిక ఇప్పటివరకు కనిపించని అత్యంత పవర్ఫుల్, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
* ఓ వీరనారి కథ
గోండు తెగల నేపథ్యంతో, హక్కుల కోసం పోరాడే ఓ వీరనారి కథగా సినిమా సాగనున్నట్లు ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ సూచిస్తున్నాయి. రష్మిక పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌లో ఆమె లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా సినిమాలో అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
ఇటీవల షూటింగ్ సమయంలో రష్మికకు తుంటికి గాయమైంది. తాజాగా ఆమె కోలుకుని త్వరలోనే తిరిగి రాగానే మేకర్స్ వేగంగా షూట్ చేసేందునకు ప్లాన్ చేస్తున్నారు. ‘మైసా’కు నవంబర్ 27, 2026 రిలీజ్ డేట్ ఖరారు కావడంతో రష్మిక అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
