Rayaparthy| ఆకేరు న్యూస్, రాయపర్తి: రాయపర్తి మండల కేంద్రంలో తస్లీమ్ హోటల్ ను ప్రారంభించారు. పెరుకవేడు రహదారి సమీపంలో షకీల్–సమీనా సుల్తానా దంపతులు ఏర్పాటు చేసిన ఈ హోటల్‌ను సోమవారం స్థానిక సర్పంచ్ గారే సహేంద్ర బిక్షపతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఆశీస్సులతో హోటల్‌ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి గుగులోత్ యాకూబ్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ అఫ్రోజ్, వర్ధన్నపేట ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఎండీ నయీమ్, మాజీ సర్పంచ్ ఎండీ ఉస్మాన్‌తో పాటు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభమైన హోటల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
