* బ్యాంకులు పని చేస్తాయి
ఆకేరు న్యూస్, డెస్క్::సాధారణంగా మార్చి నెల వచ్చిందంటే ఆర్థిక లావాదేవీల సందడి మొదలవుతుంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ రోజు మహవీర్ జయంతి సందర్భంగా సెలవు ఉండాల్సి ఉన్నా, బ్యాంకులు మాత్రం యధావిధిగా పనిచేయనున్నాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అన్ని బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.మార్చి 31తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ముగుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది.
ఈ ఏడాదికి సంబంధించిన ప్రభుత్వ రసీదులు, పన్ను చెల్లింపులు (Tax Payments),మరియు ఇతర కీలక పేమెంట్లను అదే రోజున రికార్డు చేయాల్సి ఉంటుంది.
ఆర్థిక సంవత్సరం ఆఖరి రోజు కావడంతో అకౌంట్ల క్లోజింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు బ్యాంకులు తెరిచి ఉంచడం తప్పనిసరి అని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన లావాదేవీలు నిర్వహించే అన్ని ఏజెన్సీ బ్యాంకులు మార్చి 31న పూర్తిస్థాయిలో పనిచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు తమ ఆర్థిక లావాదేవీలను గడువులోపు పూర్తి చేసుకునే అవకాశం కలుగుతుంది.యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు యధావిధిగా అందుబాటులో ఉంటాయి.నేరుగా బ్యాంకుకు వెళ్లి చేసే పనులు ఏవైనా ఉంటే, మార్చి 31న చివరి నిమిషం రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది.సాధారణంగా ఏప్రిల్ 1న బ్యాంకుల వార్షిక ఖాతాల ముగింపు ప్రక్రియ ఉంటుంది కాబట్టి, ఆ రోజు ప్రజలకు నేరుగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండకపోవచ్చు .ఆర్థిక సంవత్సరం ముగింపులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, పెండింగ్లో ఉన్న బ్యాంకింగ్ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
