
* రెపో రేటు 0.25 శాతం తగ్గింపు
ఆకేరు న్యూస్, డెస్క్ : దాదాపు ఐదేళ్ల తర్వాత రెపో రేటు (REPO RATE) 6.25 శాతానికి చేరుకుంది. 6.50 నుంచి 6.25కు ఆర్బీఐ తగ్గించింది. ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్ర (SANJAY MALHOTHRA)ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ప్రకటించారు. రెపో రేటు తగ్గింపుతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి 6.7 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. వడ్డీ రేట్ల(RATE OF INTERSTS)ను సవరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మే 2023 తర్వాత వడ్డీ రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచుతూ వస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత 6.25కు చేరింది. దీంతో రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది.
……………………………………