
* రాష్ట్రాన్ని స్తంభింపచేస్తామని హెచ్చరిక
* నోటి కాడ అన్నం ముద్దను ఆపారని బీసీ నేతల ఆవేదన
* సాయంత్రం ప్రభుత్వ స్పందనను బట్టి నిర్ణయం
* హైకోర్టు ప్రాంగణంలో ఆర్. కృష్ణయ్య
* గేట్ నంబర్ 4 వద్ద బీసీ సంఘాల ఆందోళన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హైకోర్టు ప్రాంగణం గేట్ నంబర్ 4 వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోర్టు తీర్పుపై ఈరోజు సాయంత్రం లోపు ప్రభుత్వ స్పందన ఏంటో చూస్తామని, ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి తీవ్రమైన చర్యలు చేపడతామని బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య తెలిపారు. మొత్తం రాష్ట్రాన్నిస్తంభింపచేస్తామని హెచ్చరించారు. నోటి కాడ అన్నం ముద్దను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూసి, అన్ని సంఘాలతో సంప్రదించి, పెద్ద ఎత్తున రాష్ట్ర బంద్ చేపడతామని తెలిపారు. ఈ బంద్ ద్వారా దేశానికి తమ సత్తా చాటుతామని తెలిపారు. బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేకపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తొందరాటు చర్యల వల్లే ఈ నిర్ణయమన్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ బీసీ సంఘాల కార్యకర్తల కోర్టు ప్రాంగణంలో నినాదాలు చేశారు. కాగా, హైకోర్టు ఆర్డర్ కాపీ అందిన తర్వాత ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోనుంది.