* పుస్తకప్రియుల కొత్త కార్యక్రమం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పిల్లలు, ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగించేందుకు కవులు, పుస్తకప్రియులు, రచయితలు సరికొత్త కార్యక్రమం ప్రారంభించారు. పార్కుల్లో పుస్తక పఠనం పేరుతో తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈరోజు ఇందిరాపార్కులో నిర్వహించిన కార్యక్రమం విజయవంతం కావడంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహించిన పుస్తక పఠనంలో పుస్తకప్రియులు. కవులు, రచయితలు పాల్గొన్నారు. పుస్తక పఠనం ద్వారా సమాజంలో ఆహ్లాదకర మార్పు వస్తుందని ప్రముఖ కవి యాకుబ్ అన్నారు. పుస్తకాలను ప్రేమించాలని పిల్లలకు సూచించారు. సాహిత్య విమర్శకులు రచయిత ఏకే ప్రభావ పుత్ర మాట్లాడుతూ చదువుకునే పిల్లల కోసం సెల్‌ఫోన్‌కు దూరంగా సాహిత్యం పరిచయం చేయడానికి గ్రంథాలయం ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కవులు, రచయితలకు పుస్తక ప్రేమికులకు విజ్ఞప్తి చేశారు. పార్కులోని అనేకమంది పిల్లలను ప్రభావితం చేస్తూ వివిధ గ్రంథాలయాల స్దాపన ఉద్యమకారిణి చిన్నారి ఆకర్షణ మాట్లాడుతూ తాను పుస్తకం చదవకుండా నిద్రపోనని, పుస్తకం చదివితేనే మానకసిక ప్రశాంతత ఉంటుందని, జీవితంలో ఎదుగుదల ఉంటుందన్నారు. మంచికంటి వెంకటేష్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రాంతంలో ఒంగోలులో మరో గ్రందాలయ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నానని తెలిపారు. తెలంగాణలో ఉద్యమాన్ని అన్ని ప్రాంతాలలో విస్తరింప చేయాలని ఆయన సూచించారు. పాఠశాలలు. కళాశాలలో గ్రంధాలయాలు నెలకొల్పుతూ విద్యార్దులచే ప్రతి రోజు పుస్తక పటనం చేయించాలని గ్రంధాలయ ఉద్యమ ప్రచారకులు కస్తూరి ప్రభాకర్ పేర్కొన్నారు.
…………………………………………..
