* బోయిన పల్లి వినోద్ కుమార్
ఆకేరు న్యూస్, హనుమకొండ : దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ఘనతను గుర్తించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మక్క సారక్క బ్యారేజ్ విషయంలో చత్తీస్ ఘడ్ తో యాభై ఎకరాల ముంపునకు గురించి అంగీకారం కుదిరిందని గొప్పలు చెప్పుకుంటున్నారని వినోద్ అన్నారు. 2001 లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి అప్పట్లో చంద్రబాబు దేవాదుల ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారని, 811 కోట్ల రూపాయల వ్యయం తో అప్పట్లో దేవాదులకు జీవో ఇవ్వగా,2009 లో గానీ ఆ ప్రాజెక్టు మొదటి దశ పూర్తి కాలేదన్నారు.15 వేల కోట్ల నుంచి 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఆ ప్రాజెక్టు నుంచి సరిగా నీళ్లు తొడలేక పోయారని వినోద్ పేర్కొన్నారు.170 రోజులు నీళ్లు తోడాల్సిఉండగా 110 రోజులు కూడా దేవాదులతో నీళ్లు రాలేదన్నారు.37 టీఎంసీ ల నీళ్లు కూడా కాంగ్రెస్ హయం లో తోడలేదు,ఫుట్ వాల్ కూడా సరిగా పెట్టకుండా దేవాదుల డిజైన్ చేశారని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించకుండా కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును సరిదిద్దారని వినోద్ తెలిపారు.దేవాదుల నుంచి నీళ్లు తెచ్చి నిల్వ చేసుకునేందుకు పది రిజర్వాయర్లు నిర్మించిన ఘనత కేసీఆర్ దే నన్నారు. కేసీఆర్ మీద దుష్ప్రచారం చేయడం మానేసి ప్రాజెక్టుల పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.
…………………………………..
