* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: పదేళ్ల పాటు కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుతంగా పురోగమించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ, అనుభవరాహిత్యం, అసమర్ధత, అవినీతి కలగలసిన రేవంత్ రెడ్డి పాలనలో నేడు అన్ని రంగాల్లో తిరోగమిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి రవాణా శాఖ ఆదాయం ఒక ముఖ్యమైన సూచీ అని.. ప్రజల ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లే కాక ఇతర భారీ వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వృద్ధిని చూపిస్తాయన్నారు. కానీ, తెలంగాణలో రిజిస్ట్రేషన్లు తగ్గి, ఆదాయం తిరోగమనంలో ఉందన్నారు. మన పొరుగున ఉన్న అయిదు రాష్ట్రాలు ఈ ఏడాది రవాణా శాఖ ఆదాయంలో 8 నుంచి 32శాతం వృద్ధిని నమోదు చేస్తే.. తెలంగాణ ఒక్కటే గత ఏడాది కంటే తక్కువ వృద్ధిని నమోదు చేయడం రాష్ట్రంలోని విఫల ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. పాలన గాలికొదిలేసి కక్షసాధింపు చర్యలకే పూర్తి సమయం కేటాయిస్తే ఫలితాలు ఇలా కాక మరెలా ఉంటాయి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సర్కారు తీరుపై ఆయన మండిపడ్డారు.
…………………………………………….