
* సుప్రీంకోర్టును ఆశ్రయించిన గీజాంజలి జె.అంగ్మో
ఆకేరున్యూస్ డెస్క్ : తన భర్తను అకారణంగా , చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారని అతడిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సతీమణి గీజాంజలి జె.అంగ్మో శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో సెప్టెంబర్ 24 న జరిగిన అల్లర్లతో తన భర్తకు ఎలాంటి సంబందం లేదన్నారు. సెప్టెంబర్ 24 న జరిగిన అల్లర్ల తరువాత సోనమ్ వాంగ్‌చుక్ ను అరెస్ట్ చేసి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలుకు తరలించిన విషయం తెల్సిందే.. ఈ నేపధ్యంలో పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయనే తప్పుడు ఆరోపణలతో తన భర్తను అరెస్టు చేసినట్టు గీతాంజలి ఆరోపించారు. జాతీయ భద్రతా చట్టం (NSA) కింద తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ఇంతవరకూ తనకు డిటెన్షన్ ఆర్డర్ అందలేదని, ఇది చట్ట ఉల్లంఘన కిందకే వస్తుందని ఆమె సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంతవరకూ తన భర్తను తాను సంప్రదించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
……………………………………..