* గ్రామ పంచాయతీ సిబ్బందిని అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులు
* ములుగులో తీవ్ర ఉద్రిక్తత
ఆకేరున్యూస్, ములుగు: ములుగు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడిరది. దీక్షా దివస్ నేపథ్యంలో టౌన్‌లోని బస్టాండ్ నుంచి సాధన స్కూల్ వరకు జాతీయ రహదారి డివైడర్‌కు ఇరువైపులా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ జెండాలు, తోరణాలు కట్టారు. కాగా, అనుమతి లేకుండా జెండాలు పెట్టారనే కారణంతో శుక్రవారం తెల్లవారుజామున గ్రామపంచాయతీ అధికారులు తొలగించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అక్కడి చేరుకుని సిబ్బందిని అడ్డుకోవడంతో తోరణాలను తొలగించడాన్ని ఆపేశారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి, పార్టీ నాయకులు పోరిక గోవింద్ నాయక్, విజయరామ్ నాయక్, పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన కేసీఆర్ ఆమరణ దీక్ష రోజైన దీక్షా దివస్ బ్యానర్లు తొలగిస్తారా అని మండిపడుతున్నారు.
…………………………………….