* లగచర్లలో భూసేకరణ రద్దు
* త్వరలో మరో గెజిట్ నోటిఫికేషన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ(TELANGANA)లోని కాంగ్రెస్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. లగచర్లలో భూసేకరణను రద్దు చేసింది. స్థానికుల ఆందోళనలతో రేవంత్ సర్కారు(REVANTH GOVERNMENT) వెనక్కి తగ్గింది. భూసేకరణను నోటిఫికేషన్ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా ఫార్మా విలేజ్(PHARMA VILLAGE) కోసం దుద్యాల మండలం లగచర్లలో పారిశ్రామిక పార్క్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. 580 మంది రైతులకు చెందిన సుమారు 620 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై స్థానికంగా పెద్ద ఎత్తులన ఆందోళనలు మొదలయ్యాయి. ఫార్మా విలేజ్ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన ఉన్నతాధికారులపై సైతం దాడులు జరిగాయి. కాగా ఇప్పుడు ఫార్మా విలేజ్ కోసం భూసేకరణను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఫార్మా విలేజ్ కోసం కాకుండా టెక్స్ టైల్ పార్క్ (TEXTILE PARK)కోసం భూసేకరణకు మరో గెజిట్ నోటిఫికేషన్(GEJIT NOTIFICATION) విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
…………………………………….