
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
* కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తోంది
* కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు బీసీలకు కావాలంటుందా లేక ముస్లింల కోసం అంటుందా స్పష్టత నివ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన నాంపల్లి పార్టీ కార్యలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్ల వల్ల బీసీలు నష్టపోతారని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కన్వర్టెడ్ బీసీ అని ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు . బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ పార్టీలు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని రేవంత్ చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు.కాంగ్రెస్ పార్టీ చెప్తున్న 42 శాతంలో 10 శాతం ముస్లింలకు రిజర్వేషన్లు పోతాయని కిషన్ రెడ్డి అన్నారు. ముస్లింలకు నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను ఇప్పుడు పది శాతానికి పెంచాలనే ప్రయత్నాలు కాంగ్రెస్ చేస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలతో పాటు ముస్లిం ప్రజా ప్రతినిధులు అయ్యే అవకాశం ఉందన్నారు.ఎన్నికల మందు బీసీ డిక్లరేషన్ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీలకు అన్యాయం చేస్తోందని అన్నారు. కేంద్రంలో బీసీని ప్రధానమంత్రిని చేసిన ఘనత బీజేపీది అన్నారు. దేశానికి ఇప్పుడు బీసీ ప్రధానిగా ఉన్నారని కిషన్ రెడ్డి అన్నారు. బీసీల మీద అంత ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో బీసీ ముఖ్యమంత్రి చేయాలని సవాల్ చేశారు. కేంద్ర మంత్రి వర్గంలో అత్యధిక శాతం బీసీలే ఉన్నారని కిషన్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ రెడ్డి కామెంట్ చేయడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.దశాబ్దాల కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ బీసీని ప్రధానిని చేసిందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
………………………………………………………