* పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు
* నవంబర్ 28 సాయంత్రం ఆరు గంటల వరకు
సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్లో నెలరోజులపాటు ఆంక్షలు విధిస్తున్నామంటూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నగరంలో అశాంతిని సృష్టించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్వసనీయ సమాచారం ఉండటంతో ఆంక్షలు విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నవంబర్ 28 సాయంత్రం ఆరు గంటల వరకు నెల రోజులపాటు నగరంలో సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైనా ఐదుగురికి మించి గుమికూడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బిఎన్ఎస్ సెక్షన్ 163 (పాత సీఆర్పీసీ 144 సెక్షన్) కింద ఆంక్షలు విధించినట్లు ఆదేశాల్లో వివరించారు. ఇటీవల సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడిపై దాడి ఘటన తర్వాత అల్లర్లు రేగిన సంగతి విదితమే. దీనికి తోడు గ్రూప్`1 విద్యార్థులు, మూసీ నిర్వాసితులు, బెటాలియన్ పోలీసుల వరుస ఆందోళనలతో హైదరాబాద్లో పోలీసులకు శాంతిభద్రతల నిర్వహణ సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ తాజా ఆంక్షలు విధించినట్లు సమాచారం.
……………………………………………………….