*రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం
* ములుగు జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు
ఆకేరు న్యూస్, ములుగు:గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు అన్నారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు )సంపత్ రావు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా కార్యదీక్షతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. ప్రతి విషయంలో అత్యంత జాగ్రత్త పాటించాలన్నారు. రిటర్నింగ్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి రిటర్నింగ్ అధికారులు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ప్రతి మండలంలోని గ్రామ పంచాయతీ లను క్లస్టర్లను ఏర్పాటు చేసి ఒక రిటర్నింగ్ అధికారినీ, సహాయ రిటర్నింగ్ అధికారిని నియమించామని తెలిపారు. రాష్ట్రఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకత్వా లు రిటర్నింగ్ అధికారుల కర దీపికలో సవివరంగా ఉన్నాయని, వాటిని క్షుణ్నంగా అవగాహన చేసుకొని దానికనుగుణంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణ నియమావళి ప్రకారం ఎన్నికల నోటీసు ఇవ్వాలని, నామినేషన్ల పేపర్ల స్వీకరణ, రిటర్నింగ్ అధికారి కార్యాలయం నోటీసు బోర్డు పై స్వీకరించిన అభ్యర్థుల నామినేషన్ పత్రాల జాబితా, స్వీయ ప్రకటన ప్రతులను ప్రచురించాలన్నారు, నామినేషన్ పత్రాల పరిశీలన, ఏదేని నామినేషన్ పత్రాన్ని తిరస్కరించినచో దానికి గల కారణం తెలపాలన్నారు, నామినేషన్ పత్రాల జాబితా ప్రచురించాలని, అభ్యర్థుల ఉపసంహరణ నోటీసు స్వీకరించాలని, పోటీ చేయు జాబితా, గుర్తులు కేటాయింపు, ప్రతిరోజు పర్యవేక్షించాలని, ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడినప్పటి నుండి ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని అన్నారు. ఏరోజుకారోజు టి పోల్ సాఫ్ట్ వేర్ ఆర్ ఓ లు నివేదికలను ఎలక్షన్ ప్రాసెస్ మోడల్ ను ఉంచాలన్నారు.ఈ శిక్షణ కార్యక్రమం లో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైన్లు తదితరులు పాల్గొన్నారు.

