* సంగెం నుంచి నాగిరెడ్డి పల్లె వరకు యాత్ర
* మూసీలోనూ బోటుపై పర్యటించిన రేవంత్
* భారీగా తరలివచ్చిన మూసీ బాధిత రైతులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(TELANGAN CM REVANTHREDDY) మూసీ పునరుజ్జీవ పాదయాత్ర (MUSI PUNARUJJEEVA PADAYATRA) ప్రారంభమైంది. సంగెం నుంచి నాగిరెడ్డి పల్లె వరకు యాత్ర 2.5 కిలోమీటర్ల వరకు కొనసాగింది. యాత్రకు ముందు సంగెం మూసీ నది ఒడ్డున, భీమ లింగానికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రులు కోమటరెడ్డి వెంకటరెడ్డి(KOMATI VENKATAREDDY), ఉత్తమ్ కుమార్, పొన్నం ప్రభాకర్(PONNAM PRABHAKAR) తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మూసీ(MUSI)లోనూ బోటుపై పర్యటించిన రేవంత్ అక్కడి మురుగునీటి పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం సాగిన పాదయాత్రలో మూసీ బాధిత రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రలో రైతుల సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. నాగిరెడ్డెపల్లి(NAGIREDDI PALLE)లో రేవంత్ మాట్లాడే ముందు స్థానికులు మాట్లాడుతూ.. మూసీ వల్ల కలుషితమైన ఇక్కడి మట్టికి కుండలువతాలేదని, మూసీ వాసన భరింలేకపోతున్నామని తెలిపారు. సంగెం లో తయారుచేసిన కుండలంటే పది రూపాయలకు ఇచ్చినా వద్దంటున్నారని వాపోయారు. అలాగే కొందరు రైతులు మాట్లాడుతూ.. మూసీ కలుషితం వల్ల నాట్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలిపారు. పండించిన బియ్యాన్ని తాము కూడా తినలేకపోతున్నామని వెల్లడించారు.
……………………………………….