* సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
* తిరుపతి తరహాలో బోర్డు ఏర్పాటు చేస్తామని వెల్లడి
ఆకేరు న్యూస్, యాదాద్రి : యాద్రాది కాదు.. యాదగిరిగుట్టే(Yadagiri gutta) అని పేరు మారుస్తూ సీఎం రేవంత్ రెడ్డి(cm revanthreddy) ప్రకటించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సమీక్షించిన రేవంత్ రెడ్డి యాదగిరి టెంపుల్ బోర్డు(Yadagiri Temple Board) ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టీటీడీ స్థాయిలో బోర్డుకు ప్రాధాన్యత ఉండేలా పూర్తి ఆద్యయనంతో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.
యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో ఇక నుంచి యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే, గుట్టలో గోశాలలో గో సంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీ(Special Plocy)ని తీసుకు రావాలని అధికారులను సూచించారు. గో సంరంక్షణకు అవసరమైతే టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. యాదగిరిగుట్ట కొండపై గతంలో భక్తులు నిద్ర చేసేందుకు అవకాశం ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఆదేశించారు. విమాన గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలన్నారు.
………………………………………………