– హయత్నగర్ వరకు మెట్రో వస్తది
– రాచకొండలో మరో ఫిల్మ్ సిటీ కడతాం
– ప్రపంచానికే పర్యాటక కేంద్రంగా రంగారెడ్డి జిల్లా
– గీత కార్మికులకు ‘కాటమయ్య రక్ష’ కిట్ల పంపిణీలో రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ ఎస్(BRS), బీజేపీ(BJP) వాళ్లు ప్రభుత్వాన్నిపడగొడతామంటే.. నిలబెడతామని ఎమ్మెల్యేలు తమ వద్దకు వస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి కోసమే వారు కాంగ్రెస్లో చేరుతున్నారని అన్నారు. మరో పదేళ్లు ప్రభుత్వాన్ని కాపడతామని ముందుకు వస్తున్నారని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా (Rangareddy district) లో జరిగిన గీత కార్మికులకు ‘కాటమయ్య రక్ష’ కిట్ల (‘Katamayya Raksha’ kits) పంపిణీలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో తాటి, ఈతచెట్లు పెంచుతామని గీత కార్మికులకు హామీ ఇచ్చారు. హయత్నగర్ వరకు మెట్రో వస్తదని, రాచకొండలో మరో ఫిల్మ్ సిటీ కడతామని తెలిపారు. ప్రపంచానికే పర్యాటక కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తాటి చెట్లు ఎక్కే గౌడన్నలకు ‘కాటమయ్య రక్ష’ కిట్లను తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేశారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం, లష్కర్గూడ గ్రామంలో గౌడన్నలకు కిట్లను అందజేశారు. హైదరాబాద్ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేటు సంస్థ సేఫ్టీ కిట్లను తయారు చేసింది. గీత కార్మికులు సులువుగా తాళ్లు ఎక్కేలా కిట్లను రూపొందించారు. ప్రమాదవశాత్తు తాటి చెట్ల మీద నుంచి కింద పడకుండా వీటిలో అత్యాధునిక టెక్నాలజీ వినియోగించారు. ఒక్కో కిట్లో మొత్తం ఆరు పరికరాలు ఉంటాయి. తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ వంటివి వేర్వేరుగా ఉంటాయి. ప్రస్తుతం గీత కార్మికులు ఉపయోగిస్తున్న సాంప్రదాయ కిట్ల తరహాలో ఉంటాయి. గౌడన్నలకు వాడేలా యూజర్ ఫ్రెండ్లీగా పరికరాలు ఉంటాయి.
———————-