ఆకేరున్యూస్, వరంగల్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CHIEF MINISGER REVANTHREDDY) వరంగల్ కు చేరుకున్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఉన్నారు. సుమారు రూ. 4, 600 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనకు విచ్చేసిన రేవంత్ తొలుత కాళోజీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు తలమానికంగా నిర్మించిన కాళోజీ కళా క్షేత్రాన్ని(KALOJI KALA KSHETRAM) ప్రారంభించారు. హనమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్మించిన ఈ క్షేత్రం కళలకు నిలయంగా వెలుగొందనుంది.
కాళోజీ కళా క్షేత్రం ప్రత్యేకతలు ఇవే
4.2 ఎకరాల స్థలంలో రూ.95 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. హైదరాబాద్ నగరంలో ఉన్న రవీంద్ర భారతి(RAVINDRABARATHI) కంటే పెద్దగా 1,150 మంది కూర్చునేలా భారీ స్థాయిలో నిర్మించారు. స్క్రీన్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. సభా వేదికపై కెనరా లైటింగ్స్ ఆడియో వీడియో ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులో ఆర్టియం, ప్రీఫంక్షన్ ఏరియా, వంటగది, రెండో అంతస్తులో కాళోజీ వినియోగించిన వస్తువులతో ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయి. ఆయన చేసిన రచనలతో గ్రంథాలయం తీర్చిదిద్దారు. అతిథులు, నిర్వాహకుల కోసం 12 గదులను నిర్మించారు. ఒకేసారి 500 మంది కూర్చునేలా భారీ వేదికను నిర్మించారు. నిరంతర విద్యుత్ కోసం అత్యాధునిక జనరేటర్ ను అందుబాటులోకి తెచ్చారు. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా స్టేడియం వెలుపల గార్డెనింగ్(GARDENING) ను తీర్చిదిద్దారు.