* దౌర్భాగ్య సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు : కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌పై సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTHREDDY) పగబట్టారని, దౌర్భాగ్య సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) విమర్శించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(KOUSIKREDDY)ని పరామర్శించిన ఆయన, ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. పగిలిన ఇంటి అద్దాలు, ఫర్నిచర్ ను పరిశీలించారు. దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ దగ్గరుండి ఈ దాడి చేయించినట్లుగా ఉందన్నారు. కౌశిక్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనడం తప్పా అని ప్రశ్నించారు. 100 మంది గూండాలు ఎమ్మెల్యేపై ఇంటిపై దాడి చేశారని, జరగకూడనది ఏమైనా జరిగి ఉంటే, బాధ్యత రేవంత్దా, గాంధీదా అన్నారు. కోర్టు(COURT)తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భయపడుతున్నారని, దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని పిలుపునిచ్చారు. ఆరు గ్యారంటీల అమలు కోసం పోరాడతామని తెలిపారు. దాడులకు పాల్పడిన, ప్రోత్సహించిన నేతలను, పోలీసులను ఎవరినీ వదలబోమని హెచ్చరించారు.
———————————