* ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి శుక్రాచార్యుడు పన్నాగాలు
* సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, ఖమ్మం : ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఏదులాపురం మున్సిపాలిటీలో సీఎం రేవంత్ రెడ్డి సలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నర్సింగ్ కాలేజీ, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్, జేఎన్టీయూ కాలేజీ , కూసుమంచిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపనలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం సీఎం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచే.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ సుక్రాచార్యుడిగా పన్నాగాలు చేస్తుండని, హరీష్ రావు, కేటీఆర్, మారుచిడిలా రాష్ట్రంలో తిరుగుతూ.. ప్రజా ప్రభుత్వానికి అడ్డుతగులుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాగే సింగరేణి బొగ్గు గనుల టెండర్లో అవకతవకలపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలకు స్థానం లేదని, మీడియా చానెళ్ల మధ్య ఉన్న పంచాయతితో మా పార్టీ నేతలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం నుంచి మంత్రిగా ఉండటం వల్లే ఉమ్మడి జిల్లా అభివృద్దిలో దూసుకుపోతుందని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని సీఎం కోరారు. అలాగే ఖమ్మం జిల్లాల మంత్రుల సారథ్యంలో భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి చేసి.. అయోధ్య రామమందిరం తరహాలో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. అలాగే చివరగా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి సుక్రాచార్యుడు పన్నిన పన్నాగాలో మహా పురుషులు ఖమ్మం జిల్లాలో తిరుగుతున్నారని, వారి మాటలు నమ్మి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే.. అభివృద్ధి, ప్రాజెక్టులు ఆగిపోయే ప్రమాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
………………………………………………………….

