* ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా పనిచేయాలి
* యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలి
* వీసీలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని, తప్పు చేస్తే ఆశ్చర్యకరమైన నిర్ణయాలుంటాయని సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTH REDDY) అన్నారు. యూనివర్సిటీల వీసీల(VC)తో ఆయన శనివారం సమావేశం అయ్యారు. కొత్త వీసీలకు దిశా నిర్దేశం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీల్లో గంజాయి(GANJAYI)కి తావు ఇవ్వొద్దు అన్నారు. బానిసలను గుర్తించి విద్యార్థులకు కౌన్సిలింగ్(COUNCELING) ఇవ్వాలని సూచించారు. యూనివర్సిటీలపై నమ్మకం కలిగేలా పనిచేయాలని తెలిపారు. వర్సిటీల గౌరవాన్ని పెంచాలని తెలిపారు. యూనివర్సిటీల వ్యవస్థలు దెబ్బతిన్నాయని, పునురుద్ధరణకు అధ్యయనం చేయాలని చెప్పారు. అవసరమైతేన కన్సటెన్సీలను ఏర్పాటు చేసుకుని నివేదిక తయారు చేయాలని సూచించారు. మెరిట్(MERIT) ఆధారంగా వీసీలను ఎంపిక చేశామని, బాగా పనిచేసి ప్రభుత్వానికి పేరు తేవాలని కోరారు. వంద శాతం ప్రక్షాళన చేయాలన్నారు. ఇంకా పలు కీలక సూచనలను వీసీలకు రేవంత్ చేశారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృస్ణారెడ్డి (BALAKRISHNAREDDY)కూడా పాల్గొన్నారు.