* 24 ఉపసంహరణకు గడువు
* నవంబర్ 11న ఎన్నికలు
* 14న కౌంటింగ్.. ఫలితాలు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నేటితో గడువు ముగియనుంది. ఇప్పటి వరకు 127
నామినేషన్ పత్రాలు దాఖలు అయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ వేయగా బీ ఆర్ ఎస్ నుంచి మాగంటి గోపీనాధ్ సతీమణి మాగంటి సునీత నామినేషన్ వేశారు. కాగా నేడు బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్లను అక్టోబర్ 22న పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 24 వతేదీ గడువు విధించారు. నవంబర్ 11న పోలింగ్ ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంటుంది.అదే రోజు సాయంత్రం వరకు జూబ్లీహిల్స్ ఫలితం వెలువడే అవకాశం ఉంది ఇదిలా ఉండగా అధికార పార్టీ మీద ఉన్న అసంతృప్తితో నిరుద్యోగులు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది.
………………………………………………..
