
* 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి…
* ప్రతీ ఆడబిడ్డకు నా అభినందనలు
* మహాలక్ష్మి పథకంపై సీఎం రేవంత్ ట్వీట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ఒక్క సంక్షేమ పథకం విప్లవాత్మక మార్పులకు కారణమైందని సీఎం రేవంత్ రెడ్డి (Revanthreddy) అన్నారు. మహాలక్ష్మి పథకంపై ఆయన సామాజికమాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు. 18 నెలల ప్రజా పాలనలో…200 కోట్ల జీరో టికెట్ల మైలురాయిని దాటి… ఆడబిడ్డల ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండటం… ఆనందంగా ఉంది. ఈ పథకంలో లబ్ధిదారులైన… ప్రతి ఆడబిడ్డకు నా అభినందనలు.. ఈ పథకాన్ని… దిగ్విజయంగా అమలు చేయడంలో… భాగస్వాములైన… ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది, యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు.. అని మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme)పై ట్వీట్ చేశారు.
………………………………………………