
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లాలో మే నెలలో లోంగిపోయిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ములుగు జిల్లా ఎస్.పి. శబరీష్.తెలంగాణ సరెండర్ పాలసీలో భాగంగా తక్షణ సహాయంగా ప్రభుత్వం నుండి ప్రతి ఒక్కరికీ రూ.25,000/- చొప్పున వారి నగదు రివార్డు అందజేశారు.
మిగతా రివార్డు ప్రభుత్వం నుండి మంజూరు కాగానే క్యాడర్ ఆదారంగా మడవి మంగ్లీ @ మాసే ACMకి 3,75,000/- రూపాయలు, పార్టీ సభ్యులైన మడకం కమలేష్, మడకం భీమే లకి ఒక్కొక్కరికి 75,000/- రూపాయలను చెక్ రూపంలో అందిస్తామని ఎస్పి తెలిపారు
ఈ లొంగిపోయిన వారిలో:
1) మడవి మంగ్లీ @ మాసే, Cadre: ACM, వయస్సు : 35 సంవత్సరాలు, కులం: ST-గుత్తికోయ, గ్రామం: కోమటిపల్లి , టెర్రమ్ పోలీస్ స్టేషన్ పరిధి, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం.
2) మడకం కమలేష్ S/o గంగ, Cadre: పార్టీ సభ్యుడు, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: ST-గుత్తికోయ, గ్రామం: కౌర్గట్ట, పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధి, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రం.
3) మడకం భీమే D/o సోయం మాస (లేట్), Cadre: పార్టీ సభ్యురాలు, వయస్సు: 28 సంవత్సరాలు, కులం: ST-గుత్తికోయ, గ్రామం:బుస్సాపూర్, ఉసుర్ పోలీస్ స్టేషన్ పరిధి, బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారని వివరించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత దేశంలోనే అత్యుత్తమ సరెండర్ పాలసీని అమలు చేస్తుందని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డు డిడీ, వైద్య చికిత్స, పునరావాస సహాయం అందుతుందని సమాజంలో స్థిరపడేందుకు అన్ని విధాల మద్దతు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.. మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలవమంటూ విజ్ఞప్తి చేస్తూ వివిధ పద్ధతుల్లో మరియు మాధ్యమాల ద్వారా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు సమాచారం అందించడం జరుగుతుందని తెలిపారు.
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు, ములుగు పోలీస్ విజ్ఞప్తి: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు బయటకు వచ్చి, జీవన స్రవంతిలో కలవడానికి ముందుకు వస్తే వారు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, వారు క్షేమంగా బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడంతో పాటు సరెండర్ పాలసీలో భాగంగా తక్షణమే వారికి పునరావాసాన్ని ములుగు పోలీస్ కల్పిస్తామని వివరించారు.
ఈ కార్యక్రమంలో ములుగు డి.ఎస్.పి (ఇన్చార్జి ఓ ఎస్ డి) రవీందర్, ఆర్ ఐ తిరుపతి పాల్గొన్నారు.
…………………………………………….