ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ జెండాపై గెలిచి, కాంగ్రెస్లో చేరారని అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత (Mlas Disqualify) కేసు చురుగ్గా సాగుతోంది. వారిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ ఎస్ వేసిన పిటిషన్లపై స్పీకర్ విచారణకు సిద్ధమయ్యారు. ఈమేరకు శనివారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 29 (సోమవారం) నుంచి ఒక్కో ఎమ్మెల్యే విచారణ ప్రారంభం కానుంది. తొలుత ఆరోజు ఉదయం 11 గంటలకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ (Mla Prakash Goud) ను స్పీకర్ విచారించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విచారణ, మధ్యాహ్నం ఒంటి గంటకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విచారణ, మధ్యాహ్నం 3 గంటలకు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విచారణ ఉంటుంది. అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబర్ 1న మరోసారి అదే కేసులపై న్యాయస్థానంలో విచారణలు కొనసాగనున్నాయి. పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున న్యాయవాదులు ప్రత్యక్ష వాదనలు వినిపిస్తారు. స్పీకర్/చైర్మన్ ఆధ్వర్యంలో 10వ షెడ్యూల్ ప్రకారం విచారణ జరపనున్నారు.
……………………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
