
* తెలంగాణ వాసులు మృతి
*గణేశ్ నిమజ్జనానికి వెళ్లి వస్తుండగా ఘటన
ఆకేరు న్యూస్ డెస్క్ : లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి
చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న కార్లే వారి
ప్రాణాలు తీశాయి. లండన్‌లో గణేశ్ నిమజ్జనానికి వెళ్లి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న రెండు కార్లు ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు. వారిద్దరినీ హైదరాబాద్‌కు చెందిన తర్రె చైతన్య (23), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా గుర్తించారు. కాగా, హైదరాబాద్‌లోని నాదర్గుల్కు చెందిన తర్రె ఐలయ్య, మంగమ్మల చిన్నకుమారుడు చైతన్య బీటెక్ పూర్తి చేసి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎనిమిది నెలల క్రితం లండన్ వెళ్లాడు. అక్కడ వినాయక చవితి ఉత్సవాలను
జరుపుకుని ఎనిమిది మంది స్నేహితులతో కలిసి రెండు కార్లలో నిమజ్జనం
చేసేందుకు వెళ్లారు. అంతా పూర్తిచేసి తిరిగి వస్తుండగా వారి కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ఘటనలో తర్రె చైతన్య , రిషితేజ అక్కడికక్కడే మృతి చెందగా,
మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారు అక్కడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా,
ఇద్దరి పరిస్థతి విషమంగా ఉన్నట్లు తెలిసింది. బాధితులంతా తెలుగు
రాష్ట్రాలకు చెందిన వారే. ప్రమాదంలో చైతన్య, రిషితేజ మరణించారనే
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
………………………………..