* మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపణ
ఆకేరున్యూస్, హైదరాబాద్: పత్తి కొనుగోళ్లలో రూ.3వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. పత్తి కొనుగోళ్ల కుంభకోణంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తం ఉందని విమర్శించారు. రైతులు క్వింటాకు రూ.2వేలు నష్టపోయారని అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం నాడు మీడియాతో సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. రైతు దగ్గర క్వింటాల్ పత్తిని రూ.5వేలకు కొనుగోలు చేసి… బ్రోకర్లు రూ.7 వేలకు పైగా దండుకున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.పత్తి కొనుగోళ్ల వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించాలని పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. సీసీఐ, మార్కెటింగ్ అధికారులు పత్తి రైతులను మోసం చేశారని ఆరోపించారు. పత్తి కొనుగోళ్లను సీసీఐ ఆలస్యం చేయటంతోనే.. రైతులు నష్టపోయారని చెప్పారు. కేవలం 20శాతం మంది రైతులే సీసీఐకు పంటను అమ్ముకున్నారని అన్నారు. మిగిలిన పంటను కాంగ్రెస్ నేతలు సిండికేట్గా ఏర్పడి.. సీసీఐకు అమ్ముకున్నారని ఆరోపణలు చేశారు. దీపావళి సందర్భంగా.. హైదరాబాద్లోని ఓ హోటల్లో సీసీఐ అధికారులు, ట్రేడర్ల మధ్య జరిగిన రహస్య సమావేశంలో ఈ కుంభకోణానికి బీజం పడిరదని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపణలు చేశారు.
……………………………..
