
* ఆరుగురికి తీవ్రగాయాలు
ఆకేరున్యూస్, హనుమకొండ: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు వద్ద ఓ ఆర్టీసీ బస్సు బోల్తాపడిన ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. బస్సు ఒంగోలు నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
………………………………….