* మీ ఇంట్లో గులాంగిరీ చేస్తా.. లేకుంటే మీరు నాయ ఇంట్లో చేస్తారా
* కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, వరంగల్ : 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా ఎలాంటి అక్రమాలూ చేయలేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadium Srihari) తెలిపారు. 2 వేల ఎకరాలు కబ్జా చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. బినామీలకు భూములు అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తప్పుడు ఆరోపణలపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. తనపై కబ్జా ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, పల్లా(Palla), రాజయ్య (Rajayya) ఇంట్లో గులాంగిరీ చేస్తానని అన్నారు. నిరూపించకపోతే తనకు మీరు గులాంగిరి చేయాలన్నారు. మీకు చీము-నెత్తురు ఉంటే తన సవాల్ స్వీకరించాలన్నారు. ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వరంగల్ లో తన కంటే పెద్ద లీడర్ లేరని తెలిపారు. అందుకే తనను టార్గెట్ చేశారన్నారు. ప్రభుత్వ భూములను కాపాడే వ్యక్తిని తాము అని చెప్పారు. రైతుల భూములు కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. దేవునూరు గుట్టలను రక్షించాలని మంత్రి పొంగులేటి(Ponguleti)ని కోరానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
