ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ మహ జాతరను పురస్కరించుకొని ఆర్టీసీ బోర్డింగ్, ల్యాండింగ్ పాయింట్లలో అభివృద్ధి పనులకు మేడారం లో ఆర్టీసీ అధికారులు శ్రీకారం చుట్టారు. మేడారం జాతర 2026 పనులకు టీ జి ఎస్ ఆర్ టి సి అధికారులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.ఈ భూమి పూజ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కరీంనగర్ జోన్ శ్రీ పి సోలోమాన్ , వరంగల్ రీజినల్ మేనేజర్ శ్రీ డి విజయ భాను , డిప్యూటీ రీజినల్ మేనేజర్ శ్రీ మహేష్ , డిప్యూటీ రీజినల్ మేనేజర్ శ్రీ కె భాను కిరణ్ గ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ శ్రీ రవీంద్ర సింగ్, డిపో మేనేజర్ శ్రీ ఎం రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రారంభమవుతున్న పనులు మేడారం జాతరకు విచ్చేసే భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని తెలిపారు, భక్తులకు క్యూలైన్లు, త్రాగునీరు,మరుగుదొడ్లు సౌకర్యంతో పాటు భక్తులు వేచి ఉండే షామియానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ జాతరకు ఆర్టీసీ సుమారుగా 4000 బస్సులను నడుపుతున్నట్లు భక్తులందరూ ఆర్టీసీ బస్సుల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు .ప్రైవేటు వాహనాలలో ప్రయాణించే రాదని, ఆర్టీసీ బస్సుల్లో జాతరకు విచ్చేసిన భక్తులకు అమ్మవారి గద్దె లకు దగ్గరగా చేరుకుంటారని తెలిపారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
…………………………………………….
