
* జీవో జారీ చేసిన కాంగ్రెస్ సర్కారు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ తెలంగాణ సర్కారు జీవో (GO) జారీ చేసింది. తొలి విడతలో 150 మండల సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించింది. త్వరలో మిగిలిన మండల సమాఖ్యలకు 450 అద్దె బస్సులను కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి నెలా ఒక్కో బస్సుకూ 77,220 రూపాయలను ప్రభుత్వం చెల్లించనుంది. బస్సుల కొనుగోలుకు ప్రభుత్వమే మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనుంది. మహిళా దినోత్సవం రోజు(WOMENS DAY)న సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY) 50 బస్సులను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
…………………………………..