* హైకోర్టులో పిటిషన్ దాఖలు.. విచారణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని దాఖలైన పిటిషన్పై హైకోర్టు (High Court) ఈరోజు విచారణ జరిపింది. విజయపాల్ రెడ్డి (Vijaypal reddy) ఈ పిటిషన్ను దాఖలు చేశారు. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నారని పిటిషనర్ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా కేసీఆర్(Kcr)కు ఉందని వివరించారు. కొన్ని నెలలుగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అసెంబ్లీకి వెళ్లకుంటే చట్టప్రకారం అనర్హుడిగా ప్రకటించవచ్చునని పిటిషన్ లో పేర్కొన్నారు. అనర్హతపై అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. పిల్ పై జోక్యం చేసుకోవడానికి కోర్టు పరిధి ఏంటని ధర్మాసనం ప్రకటించింది. పిటిషనర్ పిల్కు అనర్హత లేదని అసెంబ్లీ వ్యవహారాల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టుల జోక్యంపై వాదనలు వినిపించేందుకు పిటిషనర్ గడువు కోరారు. దీంతో విచారణను కోర్టు 2 వారాల పాటు వాయిదా వేసింది.
……………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
