![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/KTR.jpg)
* రైతులు యాచించాలని రేవంత్‌రెడ్డి కుట్ర
* బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని బొంద పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతులు యాచించాలని రేవంత్ రెడ్డి అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ నాయకత్వంలో 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేయాలని ఎవరూ ఆలోచించని విధంగా విప్లవాత్మకమైన పథకానికి రూపకల్పన చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాది దాటిపోయినా రైతుబంధు రూపంలో రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదు. 12వ సీజన్ కింద రూ. 7500 కోట్లు మేమే వేసేటోళ్లం. మేం దాచిపెట్టిన రూ. 7500 కోట్లను వాళ్లు రైతుల ఖాతాల్లో వేశారు. కొత్తగా ఇవ్వకపోగా.. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట బిల్డప్ ఇచ్చారు. రైతులను రాజులను చేస్తామని రాహుల్‌గాంధీ చేత ఉపన్యాసాలు ఇప్పించారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు. ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ, బోనస్ రూ. 500, రైతు కూలీలకు రూ. 12 వేలు ఇస్తామన్నారు. ఇది రైతు డిక్లరేషన్ వాగ్దానాలు అని కేటీఆర్ గుర్తు చేశారు.
……………………………….