* ట్యాంక్‌బండ్‌పై ఘనంగా ఏర్పాట్లు
* హాజరుకానున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma) సంబురాలకు తెలంగాణ సిద్ధమవుతోంది. సాయంత్రం వేడుకలకు మహిళలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్(Tankbund)పై బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు పది వేల మంది మహిళలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సీఎస్ శాంతికుమారి (Cs Shanthikumari) సమీక్ష నిర్వహించి.. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వివిధ శాఖల కార్యదర్శులు, పోలీస్ అధికారులతో వేడుకల ఏర్పాట్లపై చర్చించారు. బతుకమ్మ వేడుకలకు మహిళలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ట్యాంక్ బండ్ చిల్డ్రన్ పార్క్‌లో ఉన్న బతుకమ్మ ఘాట్‌తోపాటు నెక్లెస్ రోడ్డు(NeclesRoad)లో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నేటి సాయంత్రం నాలుగు గంటలకు అమరవీరుల స్మారక కేంద్రం నుండి వేలాది మంది మహిళలు బతుకమ్మలతో ఊరేగింపుగా ట్యాంక్‌బండ్ పైకి చేరుకుంటారు. ఈ సందర్భంగా వందలాది మంది కళాకారులతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది.
…………………………………..