
ఆకేరు సినిమా డెస్క్ : తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పురస్కారం కలైమామణి అవార్డును సాయిపల్లవికి ఇచ్చింది. కళారంగంలో ప్రతిభ కనబరుస్తున్న వారికి తమిళనాడు ప్రభుత్వం ప్రతీ ఏడూ ఈ పురస్కారాలను అందజేస్తుంది. బుధవారం తమిళనాడు ప్రభుత్వం 2021,2022,2023 సంవత్సరాలకు గాను ఏటా 30 మంది చొప్పున మొత్తం 90 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేసింది.2021 సంవత్సరానికి గాను నటి సాయిపల్లవితో పాటు నటుడు దర్శకుడు ఎస్ జే సూర్యకు కూడా ఈ అవార్డు లభించింది.వీరే కాకుండా, దర్శకుడు-నటుడు ఎస్. జె. సూర్య, దర్శకుడు లింగుసామి, నటుడు విక్రమ్ ప్రభు, మరియు మణికందన్ వంటి ప్రముఖులు కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. సాహిత్యం, సంగీతం, నాటకం, సినిమా వంటి వివిధ కళా రంగాల్లో కృషి చేసిన వారిని గుర్తించి తమిళనాడు ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. కళైమామణి అవార్డు గ్రహీతలకు మూడు సవర్ల బంగారు పతకం, ప్రశంసాపత్రం అందజేస్తారు. త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
…………………………………………..