* శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న సైఫ్
ఆకేరు న్యూస్, డెస్క్ : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(SAIF ALI KHAN)పై గత గురువారం రాత్రి దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో ఆయన ఉంటున్న ఇంట్లోకి చొరబడిన దుండగుడు కత్తితో పలుమార్లు దాడి చేశాడు. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. సైఫ్ మాత్రం కేర్‌టేకర్‌ను కాపాడి తన బిడ్డ వద్దకు దుండగుడు వెళ్లకుండా కాపాడుకున్నారు. అయితే, ఐదు రోజుల చికిత్స అనంతరం సైఫ్ అలీఖాన్ ఈరోజు లీలావతి ఆస్పత్రి (Lilavathi Hospital)నుంచి డిశ్చార్జి చేశారు. ఈనెల 16న కత్తితో జరిగిన దాడిలో మొత్తం 6 చోట్ల ఆయనకు కత్తి గాయాలు అయ్యాయి. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. శస్త్రచికిత్స చేసి సైఫ్ అలీఖాన్ వెన్నులో నుంచి కత్తి ముక్కను వైద్యులు బయటకు తీశారు. ఐదు రోజుల చికిత్స అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సైఫ్‌పై దాడిచేసిన దొంగను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
………………………………