ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : ప్రముఖ నటి సమంత వివాహం ఈరోజు ఉదయం ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో జరిగిన విషయం తెలిసిందే. కేవలం 30 మంది సన్నిహితుల మధ్య కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో వీరి వివాహం జరిగింది. అయితే ఈ విషయాన్ని సామ్ కూడా అధికారికంగా ధ్రువీకరించారు. తన ఇన్స్టా ఐడీ samantharuthprabhuofflలో తన పెళ్లి ఫొటోలను పోస్టు చేశారు. ఎరుపు రంగు చీరలో పెళ్లికూతురుగా సామ్ మిలమిల మెరిసింది. రాజ్ నిడిమోరుతో జంట కట్టి నవ్వుతూ వెళ్తున్న ఫొటోలు ఆకట్టుకున్నాయి. కాంగ్రాట్యులేషన్స్ సామ్ అంటూ ఆమె పోస్టుకు వందల సంఖ్యలో ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.
………………………………………………
