* సొసైటీ సభ్యులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ
* సొమ్మసిల్లిన మహిళా.. ఆసుపత్రికి తరలింపు
ఆకేరు న్యూస్, ములుగు : ఇసుక క్వారీ నిర్వహకులు రైతులపై దాడికి పాల్పడ్డారు. ములుగు జిల్లాలోని ఇసుక క్వారీ నిర్వాహకులు రైతులపై దాడి చేయడం కలకం రేపింది. ములుగు జిల్లా వెంకటాపురం నూగూరు మండల పరిధిలోని అబ్బాయిగూడెంలో ఇసుక లారీల కారణంగా మిర్చి తోటలు దెబ్బతింటున్నాయని లారీలను రైతులు అడ్డుకున్నారు. దీంతో ఇసుక సొసైటీ సభ్యులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇసుక క్వారీని నిలుపుదల చెయ్యాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై గ్రామస్తులు, రైతులు రాస్తారోకో చేపట్టారు. మహిళలతో పాటు రైతులపై ఇసుక క్వారీ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ మహిళ సొమ్ముసొల్లి పడిపోయింది. రోజు రోజుకు ఇసుక నిర్వహకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పంటలు దెబ్బతింటున్నాయని పలుమార్లు చెప్పినా.. తమ మాటలను పెడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతోనైనా అధికారులు స్పందించి లారీల రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
……………………………………..
