* పెను విషాదం నింపిన ఆధ్మాత్మిక యాత్ర
* హజ్‌యాత్రకు వెళ్లినవారిలో 1301 మంది మృతి
* వేడిగాలులకు తాళలేక చనిపోయినట్లు నిర్ధారణ
* యాత్రకు వచ్చినవారిలో 83 శాతం మంది అనధికారికంగా వచ్చినవారే
* అధికారికంగా ప్రకటించిన సౌదీ ప్రభుత్వం
ఆకేరు న్యూస్ డెస్క్ : దునియాలో ప్రతి ముస్లిం.. ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర.. హజ్‌యాత్ర( haj tour ) . అటువంటి యాత్ర వందలాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ముస్లింల పవిత్రమైన స్థలమైన సౌదీ అరేబియాలో (Saudi Arabia )ని హజ్లో 1301 మంది మృత్యువాత పడినట్లు అక్కడి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వేడితీవ్రతను తట్టుకోలేకే ఈ మరణాలు ( deaths ) సంభవించినట్లు వెల్లడించింది. ఈ ఏడాది హజ్ యాత్రకు దాదాపు 22 దేశాల నుంచి 10 లక్షల మంది యాత్రికులు రాగా, సౌదీ అరేబియాకు చెందిన వారే 2 లక్షల మంది ఉంటారు. ఈజిప్టు నుంచి మరో 10 లక్షలకుపైగా ముస్లింలు తరలివచ్చారని ప్రభుత్వం తెలిపింది. అయితే అధిక ఎండలు, వేడి గాలుల వల్ల యాత్రికులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారని పేర్కొంది. ఉక్కపోతతో ఊపిరాడక 1301 మంది చనిపోయినట్టు వెల్లడించింది. మరణాలు సంభవించిన రోజున రికార్డు స్థాయిలో 125 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు అధికారులు చెప్పారు. యాత్రికుల్లో 83 శాతం మంది అనధికారికంగా వచ్చినవారే ఉన్నారని, అందువల్లే గుర్తింపు ఆలస్యమైందని వెల్లడించారు.
—————————————–